Pakka Commercial రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గోపీచంద్

Saturday,May 21,2022 - 04:49 by Z_CLU

Here’s the ‘Pakka Commercial’ new release date

 మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బేనర్ పై తెరకెక్కుతున్న  ‘పక్కా కమర్షియల్’ కి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జులై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు.

గోపీచంద్ స్టైలిష్ లుక్ లో అడ్వకేట్ గా కనిపించనున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సత్యరాజ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ , సాంగ్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తూ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు SKN సహ నిర్మాత‌.

త్వరలోనే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.  కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో మారుతి మార్క్ హిలేరియస్ కామెడీ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics