హీరోయిన్లు - అప్ కమింగ్ మూవీస్

Wednesday,May 03,2017 - 10:59 by Z_CLU

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కొందరు వరుస సినిమాలతో తారాజువ్వలా దూసుకుపోతూ త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.. మొన్నటివరకూ ఏడాదికో సినిమాతో ఎంటర్టైన్ చేసిన భామలు కూడా  ప్రెజెంట్ రెండు మూడు సినిమాలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నారు.. మరి ఆ హీరోయిన్స్ ఎవరో… వాళ్ల అప్ కమింగ్ ప్రాజెక్టులేంటో చూద్దాం


లాస్ట్ ఇయర్ కేవలం ఒకేఒక్క సినిమా ‘జనతా గ్యారేజ్’ లో మాత్రమే కనిపించిన సమంత ఈ ఇయర్  ఏకంగా మూడు సినిమాలు సైన్ చేసి  ఓ రెండు సినిమాల సెట్స్ లో ఎంట్రీ ఇచ్చేసింది.. ఒక వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు ‘రాజు గారి గది-2’ ఓ మెయిన్ రోల్ లో నటిస్తుంది సమంత.. ఈ రెండింటితో పాటు త్వరలోనే ‘మహానటి’ సినిమాలో కీరోల్ చేయడానికి రెడీ అవుతుంది.


ప్రెజెంట్ టాప్ లీడింగ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా  మూడు సినిమాలతో ఎంటర్టైన్ చేయబోతుంది.. నాగ చైతన్య తో నటిస్తున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ షూటింగ్ కంప్లీట్ చేసిన రకుల్..ప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగుదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ సినిమాతో పాటు.. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తుంది.


లాస్ట్ ఇయర్ సుప్రీమ్-హైపర్ సినిమాల్లో హీరోయిన్ గా మెరిసిన రాశి ఖన్నా  చేతిలో కూడా మూడు సినిమాలున్నాయి. గోపీచంద్ ‘ఆక్సిజన్’ సినిమాతో పాటు ‘జై లవకుశ’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామ.. మరోవైపు రవితేజతో ‘టచ్ చేసి చూడు’ సినిమాలో నటిస్తూ తారాాజువ్వలా దూసుకుపోతోంది.

ప్రగ్యా చేతిలో కూడా 3 సినిమాలున్నాయి.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నక్షత్రం’ సినిమాతో పాటు బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్న ప్రగ్యా.. మరో వైపు మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలక్ట్ అయింది.

లేటెస్ట్ గా ‘నేను లోకల్’ సినిమాలో నాని సరసన సందడి చేసిన కోలీవుడ్ బ్యూటీ ప్రెజెంట్ తెలుగు లో 2 సినిమాలతో బిజీ అయిపోయింది.. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ అతిత్వరలోనే ‘మహానటి’ సినిమాలో సావిత్రిగా కనిపించనుంది…


‘శతమానంభవతి’ సినిమాతో హీరోయిన్ గా అందరినీ ఎట్రాక్ట్ చేసిన అనుపమ.. ప్రెజెంట్ రామ్ సినిమాతో పాటు అఖిల్ రెండో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ మరిన్ని ఆఫర్స్ అందుకోవడానికి రెడీ గా ఉంది.


ప్రస్తుతం గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’ సినిమాలో నటిస్తున్న అను ఇమ్మానుయేల్ మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది …


రెజీనా కూడా ప్రెజెంట్ ఓ రెండు సినిమాలతో బిజీ అయిపోయింది.. కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ సినిమాతో పాటు ‘హరే రామ హరే కృష్ణ’ అనే మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన మలయాళ ముద్దుగుమ్మ నివేత థామస్ కూడా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది.. ప్రెజెంట్ నాని తో మరో సారి ‘నిన్ను కోరి’ సినిమాలో నటిస్తున్న ఈ భామ మరో వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించబోతుంది..


హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ కూడా ఓ రెండు సినిమాలతో తారాజువ్వలా దూసుకొస్తోంది… రాజ్ తరుణ్ సరసన ‘అంధగాడు’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న ‘ఏంజెల్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.