2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘హలో’ టీజర్

Friday,November 17,2017 - 04:33 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ‘హలో’ టీజర్ నిన్న రిలీజయింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ టీజర్ కొన్ని గంటలలోనే 2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. నాగార్జున వాయిస్ తో బిగిన్ అయ్యే ఈ టీజర్ లో అఖిల్ స్టంట్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేశాయ్.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన కళ్యాణి జోడీ కట్టింది. ఫస్ట్ మూవీ తరవాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాపై న్యాచురల్ గానే హై డిమాండ్ క్రియేట్ అయింది. దానికి తోడు విక్రమ్ కుమార్ స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తున్న ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేసేసింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ అవుతుంది.