హలో... ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా

Thursday,December 14,2017 - 10:57 by Z_CLU

ప్రస్తుతం మేకర్స్ ఇదే రేంజ్ లో సినిమాను ప్రచారం చేస్తున్నారు. రెగ్యులర్ తెలుగు సినిమాకు భిన్నంగా హలో ఉండబోతోందనే విషయంపై ఇప్పటికే ఆడియన్స్ కు ఓ క్లారిటీ వచ్చేసింది. టీజర్, ట్రయిలర్ చూసిన వాళ్లు ఎవరైనా హలో సినిమా సంథింగ్ స్పెషల్ అనే విషయాన్ని అర్థంచేసుకోగలరు.

మేకర్స్ దీనిపై మరింత క్లారిటీ ఇస్తున్నారు. అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాలో హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లే ఉంటుందని చెబుతున్నారు. యాక్షన్ ఎపిసోడ్ ఇప్పటికే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఫైట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఆ ఎలిమెంట్ తో పాటు స్క్రీన్ ప్లే విషయంలో కూడా హలో సినిమా హాలీవుడ్ ను తలపిస్తుందంటున్నారు మేకర్స్.

కథ ప్రకారం ఉదయం 10 గంటలకు సినిమా మొదలై సాయంత్రం 5 గంటలకు పూర్తయిపోతుందని నాగ్ ఇప్పటికే తెలిపాడు. సో.. ఒక రోజులో జరిగే కథతో హలో తెరకెక్కిందన్నమాట. కథ, కథనంలో తనదైన మేజిక్ చూపించే విక్రమ్ కుమార్ హలో సినిమాను మరింత టైట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడట.