నాగ్ మాటల్లో ‘హలో’ హైలెట్స్

Wednesday,December 06,2017 - 07:28 by Z_CLU

అఖిల్ మూవీ ‘హలో’ డిసెంబర్ 22 న రిలీజ్ కి రెడీ అవుతుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా నాగార్జున ఈ సినిమాలోని ఇంట్రెస్టింగ్ హైలెటెడ్ పాయింట్స్ షేర్ చేసుకున్నాడు.

విక్రమ్ మార్క్ మ్యాజిక్ :  హలో సినిమా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ మూవీ. విక్రమ్ మార్క్ మ్యాజిక్ సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడే ఒక అమ్మాయి అబ్బాయి ఎలా విడిపోయారు..? మళ్ళీ ఎలా కలుసుకుంటారనేవి సినిమాలో మ్యాజికల్ మూమెంట్స్…

 

యాక్షన్ ఎలిమెంట్స్ : 30 రోజుల పాటు తెరకెక్కిన యాక్షన్ సీక్ వెన్సెస్ ఈ సినిమాలో హైలెట్ కానున్నాయి. కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని విధంగా ఉంటాయి. దానికి తోడు ఒక యాక్షన్ ఎపిసోడ్ మొత్తం కృష్ణా నగర్ రూఫ్ టాప్స్ పైనే ఉంటుంది. మొత్తం ఎపిసోడ్ గాల్లోనే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నంత సేపు అక్కడక్కడా జాకీచాన్ యాక్షన్ ఎపిసోడ్స్ గుర్తుకు వస్తాయి.

కాంప్లికేటెడ్ పజిల్స్ : సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కాంప్లికేటెడ్ పజిల్స్. హీరో తన లవ్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఫేస్ చేసే ఎలిమెంట్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి.

ఒక్క రోజులోనే సినిమా : సినిమా మొత్తం కేవలం ఒక్కరోజులోనే కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ 7:30 కి బిగిన్ సాయంత్రం 5:30 కి క్లోజ్ అవుతుంది.