ఓవర్సీస్ లో సూపర్ హిట్ అయిన 'హలో'

Monday,January 08,2018 - 05:55 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ మిలియన్ క్లబ్ లోకి ఫస్ట్ టైం చేరాడు. అతడు నటించిన హలో సినిమా ఓవర్సీస్ లో 10లక్షల డాలర్లు ఆర్జించింది. విడుదలైన మూడో వారంలో ఈ ఘనత సాధించాడు అఖిల్. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాకు 10 లక్షల 10వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. విడుదలై 3 వారాలైనా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది’

హలో సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు నిర్మాత నాగార్జున. అఖిల్ రీలాంఛ్ మూవీగా చెబుతున్న హలో సినిమాతో మొదటిసారిగా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైన అఖిల్.. ఇలాంటి మిలియన్లు మరింత అందుకోవాలని ట్వీట్ చేశాడు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది హలో సినిమా. హాలీవుడ్ రేంజ్ ఫైట్స్ తో పాటు అల్టిమేట్ ఎమోషన్స్ తో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీతో మరోసారి తన మాట నిలబెట్టుకున్నాడు నాగ్. వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం అని రిలీజ్ కు ముందే చెప్పిమరీ హలో సినిమాతో 10 లక్షల డాలర్లు ఆర్జించాడు.