RED కోసం వెయిటింగ్: హెబ్బా పటేల్

Friday,April 24,2020 - 03:50 by Z_CLU

హాట్ బ్యూటీ హెబ్బ పటేల్ RED మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు, అయినప్పటికీ REDపై ఎందుకింత క్యూరియాసిటీ. ఎందుకంటే.. ఈ సినిమాలో హెబ్బా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ తన కెరీర్ ను టర్న్ చేస్తుందని చాలా హోప్స్ పెట్టుకుంది. అందుకే ఈ వెయిటింగ్.

“రెడ్ లో స్పెషల్ సాంగ్ చేశాను. నేను డాన్స్ లో యావరేజ్. రామ్ బెస్ట్ డాన్సర్. మా ఇద్దరి కాంబోలో స్టెప్పులున్నాయి. ఈ పాటతో డాన్సర్ గా మరింత ఇంప్రూవ్ అయ్యాను. ఆ సాంగ్ కోసం వెయిటింగ్.”

రెడ్ మూవీ తర్వాత తనకు మరిన్ని ఆఫర్లు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తోంది హెబ్బా పటేల్. ఇటు రెడ్ మూవీతో పాటు అటు ఒరేయ్ బుజ్జిగా మూవీ కోసం వెయిట్ చేస్తున్నానంటోంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగాలో కూడా హెబ్బా హీరోయిన్ కాదు. ఓ కీలక పాత్ర చేసింది.