పవన్ సినిమాలో భారీ మార్పులు నిజమేనా?

Thursday,April 16,2020 - 01:13 by Z_CLU

పవన్ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ మార్పులు చేశారు. హిందీలో వచ్చిన పింక్ కు, తమిళ్ లో వచ్చిన దాని రీమేక్ కు అప్ గ్రేడ్ వెర్షన్ లో తెలుగులో వకీల్ సాబ్ ఉంటుందని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. ఇందులో భాగంగా పవన్ కు ఈ రీమేక్ లో హీరోయిన్ ను సెట్ చేశారు. అయితే ఇప్పుడా ప్లాన్ నుంచి యూనిట్ వెనక్కి తప్పుకుంటున్నట్టు టాక్.

ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే వకీల్ సాబ్ లో తను నటించడం లేదని తాజాగా ఆ ముద్దుగుమ్మ ఎనౌన్స్ చేసింది. అదే టైమ్ లో లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ కూడా లేట్ అవుతూ వస్తోంది. దీంతో హీరోయిన్ లేకుండానే వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టుంది యూనిట్.

ప్రస్తుతానికైతే ఈ మేటర్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. లాక్ డౌన్ టైమ్ కావడంతో ఎవ్వరూ దీనిపై రియాక్ట్ అవ్వడం లేదు. నిజానికి హిందీ, తమిళ వెర్షన్ లో హీరో పాత్రకు హీరోయిన్ లేదు. తెలుగు వెర్షన్ కు మాత్రం కావాలనే హీరోయిన్ ను సెట్ చేశారు. ఇప్పుడా ప్లాన్స్ నుంచి యూనిట్ తప్పుకునే ఆలోచనలో ఉందట.