గ్యారేజ్ లో హ్యాట్రిక్ ల హోరు

Sunday,September 04,2016 - 02:45 by Z_CLU

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తున్నాయి. తొలిరోజు వసూళ్లలో ఇప్పటికే టాలీవుడ్ నంబర్-2 మూవీగా జనతా గ్యారేజ్ నిలిచింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా ఉంది.

WORKING STILLS (12)

జనతా గ్యారేజ్ సినిమాతో ఒకేసారి ఇద్దరు హ్యాట్రిక్ అందుకున్నారు. వాళ్లే హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ. మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ.. శ్రీమంతుడుతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు జనతా గ్యారేజ్ తో కుడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టిన దర్శకుడిగా మారిపోయాడు. ఈమధ్య కాలంలో ఇలా కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ అందుకున్న దర్శకుడు ఎవరూ లేరు.

6s-056 copy

ఇక ఎన్టీఆర్ కూడా హ్యాట్రిక్ కొట్టాడు. పూరి జగన్నాధ్ తో కలిసి టెంపర్ తో సక్సెస్ అందుకున్న తారక్.. ఆ వెంటనే నాన్నకు ప్రేమతో సినిమాతో మరో సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ డైరక్షన్ లో చేసిన జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ అందుకున్నాడు యంగ్ టైగర్. వరుసగా మూడు హిట్స్ అందుకున్న తారక్ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నాడు.