హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయం -ఎన్.టి.ఆర్

Saturday,August 13,2016 - 03:13 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్వరలోనే ‘జనతా గ్యారేజ్’ తో ప్రేక్షుకుల ముందుకు రాబుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్ర ఆడియో వేడుకలో జూనియర్ తన మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘జనతా గ్యారేజ్’ పై తన నమ్మకాన్ని అభిమానులకు తెలియజేశాడు తారక్. వరుస అపజయాలు పలకరిస్తున్న తరుణం లో ఒక వెలుగు లా వక్కంత ఒక కథ వినిపించాడని అదే టెంపర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని. అప్పటి వరకూ అపజయాలతో సతమతమవుతున్న సమయం లో ఆ చిత్రం అభిమానులను  అలరించి విజయం అందుకోవడం కాస్త ఉత్సాహాన్ని నింపిందని. ఆ తరువాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ కూడా మంచి విజయం సాధించడం సరి కొత్త లుక్ ను ఆదరించడం మరింత ఆనందం నింపిందని, ఇక ఇది పుష్కర కాలం. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి. నా నుండి పుష్కర కాలం లో వస్తున్న గొప్ప చిత్రం ‘జనతా గ్యారేజ్’ అని. ఈ సినిమా ద్వారా మోహన్ లాల్ వంటి గొప్ప నటుడి తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని, కొరటాల శివ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయం అంటూ సినిమా పై తన కున్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు ఎన్.టి.ఆర్.