హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ ?

Wednesday,November 09,2022 - 02:15 by Z_CLU

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ (Khushi) సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇప్పటికే కొన్ని షెడ్యుల్స్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సమంత అనారోగ్య కారణం చేత షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్ లో ఇంకో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు విజయ్.

హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. ఇటివలే విజయ్ ను కలిసి హరీష్ ఓ స్క్రిప్ట్ వినిపించాడని విజయ్ కి పాయింట్ నచ్చిందని తెలుస్తుంది. వీరిద్దరి ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా ఫైనల్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఈ కాంబో సినిమా ఓ కొలిక్కి వస్తుందని సమాచారం.

పవన్ కళ్యాణ్ తో హరీష్ చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా టైం పట్టొచ్చు. ఈ గ్యాప్ లో హరీష్ విజయ్ తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. అలాగే రామ్ కి కూడా ఓ కథ చెప్పి ఉన్నాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics