'హ్యాపీ వెడ్డింగ్' థియేట్రికల్ ట్రైలర్

Saturday,June 30,2018 - 01:27 by Z_CLU

సుమంత్ అశ్విన్ , నిహారిక కొణిదెల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’.  యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. యూత్ ని  ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో  కలగలిపిన ఈ ట్రైలర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్   చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.

ఇటివలే  ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ తో ఇంప్రెస్ చేస్తుంది. ప్రస్తుతం   షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు రానుంది.