పెళ్లిపై సీరియస్ గా రియాక్ట్ అయిన నిహారిక

Thursday,June 28,2018 - 06:01 by Z_CLU

“నా పెళ్లి గురించి మీకెందుకయ్యా..? నిహారిక ఎవర్ని చేసుకుంటుంది. ఎప్పుడు చేసుకుంటుంది. చూస్తే షాక్ అవుతారు. షేక్ అవుతారు. కిందపడి లేస్తారు. పిచ్చా మీకేమైనా. యూట్యూబ్ లో మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా మీరు? “

వెడ్డింగ్ గురించి అడినందుకు ఇలా ఓ రేంజ్ లో సీరియస్ అయింది హీరోయిన్ నిహారిక. కాకపోతే ఇదంతా డ్రామానే. తన కొత్త సినిమా హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్ కోసం ఈ మెగా హీరోయిన్ ఇలా సీరియస్ అయింది.

నిహారిక పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిని మెగా కాంపౌండ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఆ ఎపిసోడ్ ను నిహారిక నటిస్తున్న హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్ కోసం ఇలా గమ్మత్తుగా వాడుకున్నారు.

జూన్ 30న ఉదయం 10 గంటల 35 నిమిషాలకు హ్యాపీ వెడ్డింగ్ థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నారు. అదే ట్రయిలర్ లో మూవీ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.