హ్యాపీ బర్త్ డే టు విజయ్ దేవరకొండ

Wednesday,May 09,2018 - 10:33 by Z_CLU

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ రోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో విశెష్ చెబుతున్నారు. దేవరకొండకు ఈ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి

అర్జున్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ సెలబ్రేట్ చేసుకుంటున్న బర్త్ డే ఇది. ఇక మరో రీజన్ ఏంటంటే.. ఈరోజే విజయ్ దేవరకొండ నటించిన మహానటి విడుదలైంది. కేవలం రిలీజ్ అవ్వడం కాదు, సూపర్ హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. ఇంకో రీజన్ కూడా ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ హీరో నటించిన 2 మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ విడుదలకు సిద్ధమయ్యాయి. అందుకే విజయ్ కు ఇది వెరీ వెరీ స్పెషల్ బర్త్ డే

ఇప్పటికే వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ హీరో, తన పుట్టినరోజు సందర్భంగా మరో మూవీ ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ పై భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ హీరో ఓ మూవీకి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాకు డియర్ కామ్రేడ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మరోవైపు టాక్సీవాలా యూనిట్ నుంచి దేవరకొండకు స్పెషల్ విశెష్ కూడా అందాయి.