హ్యాప్పీ బర్త్ డే సిమ్రాన్

Tuesday,April 04,2017 - 12:37 by Z_CLU

ఈ రోజు సిమ్రాన్ పుట్టిన రోజు. తెలుగు తమిళ హిందీ భాషల్లో దాదాపు 90 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ ఈ రోజు తన 41 వ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటుంది.

 

అబ్బాయి గారి పెళ్ళి సినిమాతో తెలుగు స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన సిమ్రాన్, టాలీవుడ్ లో మ్యాగ్జిమం బిగ్గెస్ట్ స్టార్స్ అందరి సరసన నటించి మెప్పించింది.

 

 ప్రియా… ఓ ప్రియా, మా నాన్నకి పెళ్ళి, ఆటో డ్రైవర్ సినిమాలు సిమ్రాన్ ని తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర చేశాయి. ఆ తరవాత బాలకృష్ణ సరసన సమరసింహా రెడ్డి సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన సిమ్రాన్ అల్టిమేట్ కమర్షియల్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది.

 

విక్టరీ వెంకటేష్ సరసన కలిసుందాం రా… ప్రేమతో రా సినిమాలతో వెంకీ ఫ్యాన్స్ ని కూడా తన అకౌంట్ లో వేసుకుంది ముద్దుగుమ్మ. ఒక పర్టికులర్ టైం లో సిమ్రాన్, వెంకటేష్ ఆన్ స్క్రీన్ బెస్ట్ కపుల్ గా షైన్ అయ్యారు.

 

నాగార్జున ఆటో డ్రైవర్ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన సిమ్రాన్ ‘నువ్వు వస్తావని’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో పర్ఫామెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ గా చాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.

 

మహేష్ బాబుతో యువరాజు, మెగాస్టార్ తో మృగరాజు, డాడీ లాంటి బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సిమ్రాన్, ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ, ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ముంబై లో పుట్టి యావత్ సౌత్ ఇండియాలోనే ఫేవరేట్ హీరోయిన్ గా ఫ్యాన్స్ మనసులో స్థిరపడిపోయిన సిమ్రాన్ మరిన్ని హైట్స్ రీచ్ అవ్వాలని, ఇంకెంతో సక్సెస్ ని అచీవ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.