శర్వానంద్ కెరీర్ లోనే బెస్ట్ బర్త్ డే

Monday,March 06,2017 - 09:24 by Z_CLU

ఇప్పటివరకు చాలా పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకొని ఉంటాడు శర్వానంద్. తనకున్న స్టేటస్ ప్రకారం.. గ్రాండ్ పార్టీస్ కూడా ఇచ్చి ఉంటాడు. కానీ ఈరోజు శర్వ సెలబ్రేట్ చేసుకునే పుట్టినరోజు మాత్రం ఈ హీరోకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇది అతడి మనసుకు బాగా దగ్గరైన పార్టీ అవుతుంది. ఎందుకంటే.. హీరోగా పీక్ స్టేజ్ ఎంజాయ్ చేస్తున్నటైమ్ లో వచ్చిన పుట్టినరోజు ఇది.

 

గతంలో రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి హిట్స్ కొట్టాడు శర్వానంద్. కానీ ఈసారి మాత్రం శతమానంభవతి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు.. ఈ మూవీతో ఓవర్సీస్ లో కూడా తన మార్కెట్ పెంచుకున్నాడు. మీడియం లెవెల్లో నిర్మాతలకు మోస్ట్ డిపెండబుల్ హీరోగా కనిపిస్తున్నాడు. అలా కెరీర్ లో బెస్ట్ ఫేజ్ లో ఉన్న శర్వానంద్ ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

 

ప్రస్తుతం ఈ హీరో 3 సినిమాలు లైన్లోపెట్టాడు. చంద్రమోహన్ దర్శకత్వంలో చేస్తున్న రాధ సినిమా ఫస్ట్ లుక్ ఈమధ్యే రిలీజైంది. ఇక రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో మహానుభావుడు అనే సినిమా స్టార్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలతో పాటు బాహుబలి నిర్మాతలతో, ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్.