హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్

Monday,March 27,2017 - 11:02 by Z_CLU

మెగా పవర్ స్టార్ బర్త్ డే ఈ రోజు. మార్చ్ 27, 1985 లో జన్మించిన రామ్ చరణ్ ఈ రోజు తన 31st   బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఓ వైపు సుకుమార్ సినిమా మేకోవర్ కోసం బిజీ బిజీ ప్లానింగ్ లో ఉన్న చెర్రీ, ఆ ప్రిపరేషన్స్ మధ్య తన బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.

80’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ అల్టిమేట్ లవ్ స్టోరీకి ఇంకా గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది. రేపో మాపో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో సమంతా హీరోయిన్ గా ఫిక్సయింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ధృవ సినిమాతో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ని బ్యాగ్ లో వేసుకున్న చెర్రీ ఈ ఇయర్ కూడా పక్కా ప్లానింగ్ తో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ తో ప్రొడ్యూసర్ గా మారిన చెర్రీ, మెగా 151 ని కూడా తానే నిర్మించనున్నాడు. ఓ వైపు స్టార్ గా, మరోవైపు ప్రొడ్యూసర్ గా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంటున్న చెర్రీ, మరిన్ని హైట్స్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది జీ సినిమాలు.