హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్

Friday,September 02,2016 - 12:30 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అంతులేని అభిమానులకు ఆరాధ్య దైవం. ‘పవనిజం’.. అందరికీ సాటిలేని ఉత్తేజ మంత్రం. ఆయన మానవత్వానికి ఆకాశమే హద్దు. ఏ హీరో గురించి మాట్లాడినా ఆయన పలానా సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. పలానా చిత్రం ఆయనకు బ్రేక్ ఇచ్చిందనుకుంటాం ! కానీ, పవర్ స్టార్ గురించి ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చేది అత్యున్నతమైన ఆయన వ్యక్తిత్వం. సాటి మనిషి కష్టాన్ని చూస్తే కరిగిపోవడమే కాదు, కొండంత అండగా నిలబడటం, పబ్లిసిటీ కి దూరంగా ఉండడం పవర్ స్టార్ కి సినిమాలకు అతీతమైన క్రేజ్ ను సంపాదించి పెట్టాయి. ఆకాశమంత ఎత్తుకి ఎదిగినా సాదాసీదాగా వుండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.