మోక్షజ్ఞ హీరోగా సినిమా...?

Tuesday,September 06,2016 - 11:50 by Z_CLU

 

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే తెలుగు తెర పై కథానాయకుడిగా పరిచయం అవ్వడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే తనయుడి ఎంట్రీ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే నటన తో పాటు కొన్ని శిక్షణలు నేర్చుకున్న మోక్షజ్ఞ ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి దర్శకత్వ శాఖ లో పనిచేస్తున్నాడు. సినిమా పట్ల పూర్తి అవగాహన కోసమే తనయుడి ను ఈ చిత్రానికి దర్శకత్వ శాఖ లో పెట్టారట బాలయ్య. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కు సర్వం సిద్ధం చేస్తున్నాడట బాలయ్య. ఈ సినిమా పూర్తి కాగానే తనయుడి సినిమాకు సంబంధించిన పనులు చేపడతాడనే టాక్ వినిపిస్తుంది. ఈ నందమూరి యువ కథానాయకుడి కోసం ఇప్పటికే ముగ్గురు నలుగురు టాప్ దర్శకులను లైన్ పెట్టాడట బాలయ్య. వీరిలో వినాయక్, పూరి జగన్నాధ్ లతో పాటు త్రివిక్రమ్ పేరు కూడా పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక త్వరలోనే నందమూరి వంశం నుండి యువ కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.