హ్యాపీ బర్త్ డే బోయపాటి

Tuesday,April 25,2017 - 11:19 by Z_CLU

18 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నాడు. చేసింది మాత్రం అరడజను సినిమాలు మాత్రమే. అయితే ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత సక్సెస్ రేటు ఉందనేది ముఖ్యం. అందుకే వందకు వందశాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను.

భద్ర సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ దర్శకుడు తాజాగా సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నాడు. ఈ రెండు సినిమాల మధ్యలో బోయపాటి చేసిన ప్రతి మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే ఇండస్ట్రీలో అందరూ ఇతడ్ని “బ్లాక్ బస్టర్ బోయపాటి” అని పిలుస్తుంటారు.

వెంకటేష్, రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేశారు బోయపాటి. అయితే ది బెస్ట్ కాంబినేషన్ మాత్రం బాలయ్య-బోయపాటిదే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. బోయపాటి శ్రీనుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.