హను రాఘవపూడి ఇంటర్వూ

Wednesday,August 09,2017 - 03:06 by Z_CLU

నితిన్ లై సినిమా ఆగష్టు 11 గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. రిలీజ్ కి ముందే ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ సినిమాపై హాయ్ ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా  ‘లై’ డైరెక్టర్ హను రాఘవపూడి  ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ ఎక్స్ పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. అవి మీకోసం…

లై’ సినిమా కథ అలా బిగిన్ అయింది

విలన్ తో బిగిన్ అయింది. నా మైండ్ లో ఫస్ట్ ఫిక్సయింది విలన్ క్యారెక్టరైజేషనే. ఆ తరవాత నితిన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు స్టోరీని బిల్డ్ చేసుకున్నాను.

 

స్టోరీ ఏదైనా లవ్ స్టోరీ కంపల్సరీ

లవ్ స్టోరీ కంపల్సరీ. లవ్ ఈజ్ ఎవ్రీ వేర్ అని నమ్ముతాను నేను. తీసే కథ ఎలాంటిదైనా అందులో లవ్ స్టోరీ కంపల్సరీగా ఉండాల్సిందే.

నితినే పర్ ఫెక్ట్ అని ఎందుకు అనిపించింది..?

ఈ క్వశ్చన్ కి సమాధానం మీరు సినిమా చూసిన రోజు మీకు తెలిసిపోతుంది.

సినిమా స్టైలిష్ గా ఉండాలని ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు..?

అసలలాంటి ప్లానే వేయలేదు. నేను అనుకున్నది కథ మాత్రమే. కథను బట్టే సినిమాని ఎలా తీయాలో నిర్ణయిస్తాం. కథని బట్టి  ‘లై’ స్టైలిష్ గానే తీయాలి , U.S. లోనే తీయాలి. అది కథ చేసిన డిమాండ్. ఓ స్టైలిష్ సినిమా చేయాలి అని పని కట్టుకుని తీసిన సినిమా కాదిది. లై సినిమాలో అద్భుతం కథే.

లై’ లో రివేంజ్ డ్రామా ఉంటుందా..?

‘లై’ లో ట్రిక్కి స్పేస్ ఉంది,  అది స్క్రీన్ పైనే చూడాలి. ఎగ్జాక్ట్ గా రివేంజ్ అని చెప్పలేం, కానీ రివేంజ్ షేడ్స్ అయితే ఉంటాయి.

ఆయన ఒప్పుకున్న రోజే సినిమా హిట్ అయింది 

ఈ సినిమాకి అర్జున్ గారు ఒప్పుకున్న రోజే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను చిన్నప్పటి నుండే ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ ని. మా ఊరిలో ఆయన ప్రతి సినిమా రిలీజ్ అయ్యేది. ఏ సినిమా వదిలే వాణ్ణి కాదు. అలాంటిది ఆయనతో పని చేయడం నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంటే. అర్జున్ ఒప్పుకోవడంతో రిలీజ్ కు ముందే మా సినిమా హిట్ అయింది.

ఇంటరెస్టింగ్ పాయింట్స్

హీరోకి ఒక అబ్సెషన్ ఉంటుంది. ఆ అబ్సెషనే సినిమా మొత్తాన్ని డ్రైవ్ చేస్తుంది. హీరోని హీరోయిన్ తో కనెక్ట్ చేస్తుంది… విలన్ తో కనెక్ట్ చేస్తుంది. హీరో క్యారెక్టర్ ఇండియా నుండి U.S. కి వెళ్తాడు. అయితే హీరో ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు…? U.S. కి వెళ్ళాక ఏం చేసేవాడు అనేవి ఇంటరెస్టింగ్ పాయింట్స్.

సినిమా మేకింగ్ మన స్థాయిలో జరగాలి

ఒక సినిమాని ఎ స్తాయిలో తీస్తున్నామో, దానికి సంబంధించిన ప్రతి ఇమోషన్ ని అదే స్థాయిలో తీయాలి.  సినిమా మేకింగ్ విషయంలో ఏది కష్టమో ఎగ్జాక్ట్ గా చెప్పలేం, ఒక్కోసారి చిన్న క్లోజ్ తీయడమే కష్టమనిపిస్తుంది. ఒక్కోసారి  పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా ఈజీ అనిపిస్తాయి. ఏం చేసినా మెటబాలిజంకి సూట్ అవ్వాలి అంతే.

నాకు దెయ్యాలంటే భయం

నేను హారర్ సినిమా చేయలేను. అసలు హారర్ సినిమాలు చేయడం చాలా కష్టం. అలాంటి సినిమా చేయాలంటే ఎవ్రీ సెకండ్ ఆడియెన్స్ మైండ్ ని రీడ్ చేయాలి. ఒకరిద్దరిని చదవడమే కష్టం, అంతమందిని చదవాలంటే ఇంకా కష్తం. అందునా నాకు దెయ్యాలంటే చాలా భయం. అందుకే హారర్ సినిమాలు చూడను, చేయను.

ప్రొడ్యూసర్ నమ్మాల్సింది కథనే…

ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకండా ఏం చేయలేం, సపోర్ట్ అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ కథను నమ్మాలి, డైరెక్టర్ కన్నా కథని నమ్మినప్పుడే ఆ కథని ఎక్జిక్యూట్ చేసే ప్రాసెస్ లో తను ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడే అవుట్ పుట్ బాగా వస్తుంది.

ఫ్యూచర్ సినిమాల గురించి

యాక్షన్ సినిమాలు చేయాలి, ఇరానియన్ యాక్షన్ సినిమాలు చూస్తుంటా… అలాంటి సినిమాలు చేయాలి… నిజానికి అదే నా టార్గెట్, డెస్టినేషన్.