Hansika Telugu Movie - షూటింగ్ అప్ డేట్స్

Sunday,August 01,2021 - 01:53 by Z_CLU

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న హన్సిక మై నేమ్ ఈజ్ శృతి

ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది.

Hansika My name is shruti 3
బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్‌ థ్ల్రిలర్‌ని ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం. ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ ప్రారంభమౌతుంది.

Hansika My name is shruti 3

మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర, సీవీఎల్‌ వినోదిని, సాయితేజ్‌ కాల్వకోట, మహేష్‌ తదితరులు నటిస్నున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్‌ బోయిడపు, సంగీతం: మార్క్‌.కె.రాబిన్‌, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్‌, ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics