గౌతమ్ నంద లో హన్సిక ఫస్ట్ లుక్

Friday,June 23,2017 - 02:58 by Z_CLU

 గోపీచంద్ గౌతమ్ నంద ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ తో కావాల్సినంత ఇంప్రెషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. హన్సిక, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే మాస్ షేడ్స్ లో కనిపించనున్న నంద క్యారెక్టర్ కి హీరోయిన్ గా కనిపించనున్న హన్సిక ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

 

అటు గ్లామరస్ రోల్స్ లోను, ఇటు పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ తో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న  హన్సిక ఈ సినిమాలో ‘స్ఫూర్తి’ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు కన్ఫం చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాని J. పుల్లారావు, J. భగవాన్ కలిసి నిర్మిస్తున్నారు. సంపత్ నంది ఈ సినిమాకి డైరెక్టర్.