‘గురు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Tuesday,November 22,2016 - 03:47 by Z_CLU

తన కరియర్ లోనే ఫస్ట్ టైం బాక్సర్ గా నటిస్తున్న వెంకటేష్ ‘గురు’ ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. హిందీ బ్లాక్ బస్టర్ ‘సాలా ఖడూస్’ కి రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని జనవరి 26 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. ఈ సినిమాలో రితిక సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘గురు’ వైజాగ్, ఊటీ, వంటి లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో క్యారెక్టర్ కి తగ్గట్టు, ప్రొఫెషనల్ బాక్సర్ లా కనిపించడం కోసం చాలా కష్టపడ్డాడు వెంకీ. ఫస్ట్ లుక్ లో వెంకీ గెటప్ చూస్తుంటే తనెంత డెడికేటెడ్ గా ఈ సినిమా కోసం పని చేశాడో తెలుస్తుంది. ఈ సినిమా హిందీ వర్షన్ లాగే తెలుగు లోను బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.