'గురు' హంగామా షురూ

Saturday,February 18,2017 - 03:06 by Z_CLU

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ‘గురు’ సాంగ్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. సుధాకొంగర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను ఇటీవలే సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది యూనిట్. సంతోష్ నారాయణ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘ఓ సక్కనోడా’ అనే సాంగ్ ప్రెజెంట్ అందరినీ ఆకట్టుకుంటూ సినిమా పై అంచనాలను పెంచేసింది.  ముఖ్యంగా ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి…


ఇక త్వరలో మరో సాంగ్ ని కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు యూనిట్. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘సాలా ఖదూస్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. సమ్మర్ కానుకగా మార్చ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలు రీమేక్స్ తో టాలీవుడ్లో మంచి విజయం అందుకున్న వెంకీ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడా.. అనే క్యూరాసిటీ మొదలైంది….మరి సమ్మర్లో ఈ సినిమాతో వెంకీ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో..చూడాలి.