50 రోజులు పూర్తి చేసుకున్న గురు

Friday,May 19,2017 - 11:45 by Z_CLU

వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటించిన అల్టిమేట్ స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ ‘గురు’ సక్సెస్ ఫుల్ గా 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా హై ఎండ్ ఇమోషనల్ వ్యాల్యూస్ తో అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడంలోను సూపర్ సక్సెస్ అయింది.

హిందీ బ్లాక్ బస్టర్ సాలా ఖడూస్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. దానికి తోడు వెంకటేష్ కూడా తన కరియర్ లోనే ఫస్ట్ టైం ఈ సినిమాలో పాట కూడా పాడటం… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలోని ప్రతి ఎలిమెంట్ సినిమా సక్సెస్ కి పెద్ద ఎసెట్ లా నిలిచింది. టాలీవుడ్ లో ఫార్ములా సినిమాలకే సక్సెస్ రేషియో ఎక్కువ అని ఫిక్సయిన టైం లో పాత్ బ్రేకింగ్ లా రిలీజైన ‘గురు’ మరిన్ని కంటెంట్ ఉన్న సినిమాలకు ఇన్స్ పిరేషన్ లా నిలిచింది.