సాంగ్స్ తో రెడీ అవుతున్న గురు....

Tuesday,February 14,2017 - 06:06 by Z_CLU

విక్టరీ వెంకటేష్ తన లేటెస్ట్ మూవీ ‘గురు’ సాంగ్స్ తో హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టీజర్ తో సినిమా పై అంచనాలను తార స్థాయికి చేర్చిన వెంకీ ఇప్పుడు సాంగ్స్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేయబోతున్నాడు. సుధా కొంగర డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలోని ‘సక్కనోడా’ అనే ఫస్ట్ సాంగ్ ను ఫిబ్రవరి 17న సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయబోతున్నారు.

venkatesh-guru-poster

లేటెస్ట్ గా ‘కబాలి’ సాంగ్స్ తో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న సంతోష్   నారాయణ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తుండడంతో ఈ ఆల్బమ్ పై భారీ అంచనాలే నెలకొంటున్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తో త్వరలోనే థియేటర్స్ లో అడుగుపెట్టి తనదైన స్టైల్ లో హంగామా చేయబోతున్నాడు వెంకీ…