అంతా కోరుకునే కాంబినేషన్లు..

Tuesday,October 04,2016 - 11:49 by Z_CLU

గుండమ్మ కథ టాలీవుడ్ అద్భుత సినిమాల్లో ఒకటి. కామెడీ ప్రధానాంశంగా ANR, NTR కాంబినేషన్ లో తెరకెక్కిన ఎవర్ గ్రీన్ క్లాసిక్. అందుకే మళ్ళీ ఆ ఇద్దరి నట వారసులు నాగచైతన్య, తారక్ కాంబినేషన్ లో తెరకెక్కించాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. అందరూ అనుకుంటున్న ప్రకారం ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఇక తిరుగు ఉండదనుకోండి.

ntr-naga-chaithanya-collage

కాకపోతే ఈ ఇద్దరు కాకుండా ఇంకా ఏయే స్టార్ కాంబినేషన్ ఆ క్యారెక్టర్స్ కి మ్యాచ్ అవుతారో చూద్దామా..?

pavan-mahesh

కాంబో సంగతి కాసేపు అటుంచితే ఇద్దరికిద్దరూ భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళే. గతంలో మల్టీ స్టారర్ సినిమాలోను ఏ మాత్రం ఈగో క్లాషెస్ రాకుండా నటించి ఇండస్ట్రీకి గుర్తుండిపోయే హిట్స్ ఇచ్చిన వాళ్ళే. వీళ్ళు గాని గుండమ్మ కథని నడిపితే  వెండితెర జిల్ జిల్ జిగే.. అనుమానమే లేదు.

prabhas-rana

ఇప్పటికే బాహుబలి కోసం దాదాపు నాలుగేళ్ళుగా అన్నాదమ్ముల్లా నటిస్తూనే ఉన్నారు. వీరిద్దరి కన్నా బెస్ట్ కాంబో ఇంకెవరిది ఉంటుంది చెప్పండి. రాజ్యం, రాణి, యుద్ధం, ప్రతీకారం లాంటివి కాస్త పక్కన పెట్టి, గుండమ్మ ఇంట్లో ఏదోలా అడుగు పెట్టేశారనుకోండి.. అదిరి పోదూ…

allu-arjun-family-photos-cousin-ram-charan-teja

ఆ మధ్యెప్పుడో ‘ఎవడు’ సినిమాలో కలిసి నటించారు. అసలు ఒక్క సీన్ లో కూడా ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన సీన్ లేకపోయినా సినిమా మాత్రం ఇద్దరిదే. ఎవడు సినిమా చూస్తున్నంత సేపు ఈ ఇద్దరి కాంబినేషన్ థియేటర్ లలో చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అంతటి పవర్ ఫుల్ పర్ఫార్మర్స్ గుండమ్మ కథ కోసం మరోసారి కలిస్తే… టాప్ లేచి పోద్దంతే.