Gully Rowdy - సెన్సార్ కు రెడీ

Tuesday,June 29,2021 - 12:47 by Z_CLU

Gully Rowdy gears up for Censor formalities

సందీప్ కిష‌న్ టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. కోన వెంక‌ట్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘గల్లీ రౌడీ’ సినిమా వస్తోంది.

న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్‌. ఈ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది.

ఇప్ప‌టి వ‌ర‌కు సందీప్ కిష‌న్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను ‘గ‌ల్లీరౌడీ’లో చేశాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ మాంటేజ్ సాంగ్ ‘పుట్టనే ప్రేమ…’కు కూడా మంచి స్పందన వచ్చింది. సినిమా ఫన్ రైడర్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం ఖాయ‌మ‌ని అంటోంది యూనిట్.

Gully Rowdy movie sundeep kishan neha shetty zeecinemalu (1)

న‌టీన‌టులు:  సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌,బాబీ సింహ,   నేహా శెట్టి,పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

బ్యానర్:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా

స‌మ‌ర్ప‌ణ‌:  కోన వెంక‌ట్‌

ద‌ర్శ‌క‌త్వం:  జి.నాగేశ్వ‌ర్ రెడ్డి

నిర్మాత‌:  ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌

సంగీతం:  చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌

స్క్రీన్ ప్లే:  కోన వెంక‌ట్‌

క‌థ‌:  భాను

ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌

స్టైలిష్ట్‌:  నీర‌జ కోన‌

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics