తళుక్కులు...

Saturday,October 08,2016 - 10:00 by Z_CLU

స్క్రీన్ పై కనిపించేది కాసేపే అయినా సినిమా పై పడే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. కథ డిమాండ్ చేసింది కాబట్టి దర్శకులు ప్లాన్ చేస్తారా, లేకపోతే సదరు స్టార్స్ ఫ్రెండ్ షిప్ కొద్దీ సినిమాలో కనిపిస్తారా అనేది పక్కన పెడితే తెలుగు సినిమాలో ‘గెస్ట్ రోల్స్’ హవా కాస్త ఎక్కువగానే హడావుడి చేస్తుంది.

నాగచైతన్య ప్రేమమ్ లో వెంకటేష్, నాగార్జున  ఎంట్రీ అభిమానులకు పెద్ద ట్రీట్. మలయాళ ప్రేమమ్ కి రీమేకే అయినా తెలుగు వర్షన్ లో చందూ మొండేటి సరైన ప్లానింగ్ తో ఈ ఇద్దరు స్టార్స్ కి స్పేస్ క్రియేట్ చేశాడు.

నాని మజ్నులో రాజమౌళి, ఆ తరవాత రాజ్ తరుణ్, స్క్రీన్ పై ఎంత సేపు కనిపించారు అన్నది పక్కన పెడితే, ఆ మాత్రం అప్పియరెన్స్ కి కారణం మాత్రం ఫ్రెండ్ షిప్పే. ఐడియా డైరెక్టర్ ఇచ్చాడో మరి నాని ప్లాన్ చేశాడో తెలీదు కానీ ఇద్దరి ఎంట్రీ మాత్రం అదుర్స్.

అవసరాల సినిమాలన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి. అదే ఆయన స్పెషాలిటీ. కానీ తన రీసెంట్ మూవీ

 ‘జ్యో అచ్యుతానంద’ క్లైమాక్స్ లో నాని అప్పియరెన్స్ మూవీకి బాగానే వెయిట్ పెంచింది.

చాలా రోజుల తరవాతే అయినా మంచి ఎంటర్ టైనింగ్ కాన్సెప్ట్ ని ఎంచుకున్న సుశాంత్ ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో నాగచైతన్య గెస్ట్ రోల్ చేసి తన ఫ్యామిలీ హీరోకు మంచి సపోర్ట్ నే ఇచ్చాడు.

హేబా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమాలో రాజ్ తరుణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. కుమారి 21 F తరహాలో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.