'నిన్ను కోరి' టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

Saturday,June 10,2017 - 11:04 by Z_CLU

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నుకోరి’ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ నిన్న రిలీజైంది. సోషల్ మీడియాలో టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ కు 10లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ కనిపించే ఈ టీజర్‌లో నాని వాయిస్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ‘ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ. అన్ని అలవాట్లు వున్నవాళ్ళని ప్రేమిస్తారు.. ఏ అలవాట్లూ లేనివాడ్ని పెళ్ళి చేసుకుంటారు’ అనే డైలాగ్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న ‘నిన్నుకోరి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు కోన వెంకట్ సమకూర్చగా.. గోపీసుందర్ సంగీతం అందించాడు.