అక్కడే సెటిలవుతుందా?

Sunday,December 11,2016 - 09:00 by Z_CLU

టాలీవుడ్ లో కమలినీ ముఖర్జీ అంటే తెలియని వాళ్లుండరు. ‘ఆనంద్’,’గోదావరి’,’హ్యాపీ డేస్’,’గమ్యం’ వంటి సినిమాల తో హీరోయిన్ గా అందరినీ ఎట్రాక్ట్ చేసి విజయాలు అందుకున్న ఈ భామ లేటేస్ట్ గా మాలీవుడ్ లో  హీరోయిన్ గా గ్రాండ్ హిట్ అందుకుంది.

తెలుగులో హీరోయిన్ గా అడపాదపడ సినిమాలతో పాటు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ తోనూ ఎంటర్టైన్ చేసిన ఈ ముద్దుగుమ్మ, రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాలో శ్రీకాంత్ కు పెయిర్ గా నటించింది. ఈ సినిమా ఈ భామ కు తెలుగులో మరో ఆఫర్ తెచ్చిపెట్టక పోవడం తో మలయాళం లో ‘కజిన్స్’ అనే సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఆ తరువత తమిళ్ లో ‘ఇరైవి’ సినిమా తో సూపర్ హిట్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా మలయాళం లో ‘పులి మురుగన్’ సినిమాలో మోహన్ లాల్ కు జోడి గా నటించి ఈ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకుంది కమలినీ . ఈ సినిమా మలయాళం లో దాదాపు 100 కోట్లు సాధించడంతో అక్కడ ఉన్నట్టుండి స్టార్ హీరోయిన్ అయిపోయింది.

మన్యం పులి తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో కమలిని యాక్టింగ్ కి మంచి ఎప్లాస్ వచ్చింది. ఆ మధ్య చిన్న గ్యాప్ తో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న కమలినీ ముఖర్జీ, మెల్లిగా కరియర్ కి ట్రాక్ వేసుకుంటుంది.