రేపే గ్రాండ్ గా సాహో ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Saturday,August 17,2019 - 02:24 by Z_CLU

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తుంది సాహో. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఇక ఇప్పుడు ఈ హీట్ ని మరింత పెంచేందుకు రామోజీ ఫిల్మ్ సిటీ లో కనీవినీ ఎరుగని రీతిలో రేపు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు.

అభిమానులు భారీగా వచ్చే ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యే ఈ ఈవెంట్ కోసం కళ్లుచెదిరేలా భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే… హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. శ్రద్ధా కపూర్ తో తీసిన రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వచ్చాయి.

దుబాయ్, రొమేనియాలో తీసిన యాక్షన్ సినిమాకు హైలెట్ అంటున్నారు. వీటితో పాటు ప్రభాస్ గెటప్ కూడా అదిరిపోయింది. జిబ్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో అదనపు ఆకర్షణ. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

న‌టీన‌టులు:
ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజ‌య్, మందిరా బేడీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: సుజీత్
నిర్మాత‌లు: వ‌ంశీకృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి, భూష‌ణ్ కుమార్
సంగీతం: త‌నిష్క్ బ‌గేచీ, గురు రంధ్వా
నేప‌థ్య సంగీతం: జిబ్ర‌ాన్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ మ‌ది
ఎడిట‌ర్: శ్రీక‌ర్ ప్ర‌సాద్