U.S. టూర్ కి సిద్ధపడుతున్న గౌతమీపుత్ర శాతకర్ణీ

Tuesday,January 17,2017 - 12:30 by Z_CLU

బాలయ్య వందో చిత్రం. ఫ్యాన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్.. క్రిష్ కథ చెప్పీ చెప్పగానే గ్రీన్  సిగ్నల్ ఇచ్చేసిన బాలయ్య, తెలుగు జాతి గర్వించదగ్గ సినిమాను చేసి అందరి చేత భేష్ అనిపించుకున్నాడు, ఇటు డొమెస్టిక్ మార్కెట్ లోను, అటు ఓవర్ సీస్ మార్కెట్ లోను ప్రభంజనం సృష్టిస్తున్న GPSK యూనిట్, ఇప్పుడు U.S. టూర్ ప్లాన్ చేసుకుంది.

బాలయ్యతో పాటు, శ్రియ , డైరెక్టర్ క్రిష్ పాల్గొననున్న ఈ టూర్ షెడ్యూల్ కూడా ఫిక్సయింది. గురువారం రోజు Bay Area లో అభిమానులను పలకరించనున్న యూనిట్, శుక్రవారం సాయంత్రం Dallas లో, శనివారం Detroit, ఆదివారం Philadelphia & New Jersey లో ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా కలుసుకుని, ఇంత సక్సెస్ ని ఇచ్చినందుకు గ్రాండ్ గా థాంక్స్ చెప్పనుంది సినిమా యూనిట్.