'గౌతమి పుత్ర శాతకర్ణి' వారం కలెక్షన్స్

Thursday,January 19,2017 - 08:16 by Z_CLU

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ దూసుకెళ్తుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం లోనే 40 కోట్ల షేర్ దాటి 50 కోట్ల క్లబ్ వైపు పరిగెడుతుంది.

రిలీజ్ రోజు నుంచే పాజిటీవ్ టాక్ తో బాలయ్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమా గా గుర్తింపు అందుకున్న ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకెళ్తుంది. తాజాగా బాలయ్య పర్యటన తో ఓవర్సీస్ లో కలెక్షన్స్ మరింత ఊపందుకుంటున్నాయి.

ప్రెజెంట్ 40 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఈ సినిమాతో ఫైనల్ గా బాలయ్య ఎంత కలెక్ట్ చేస్తాడో? చూడాలి.