ఆ టైటిల్ తో వస్తున్న గోపి చంద్....

Saturday,February 04,2017 - 01:14 by Z_CLU

టాలీవుడ్ లో ఈ మధ్య ఫేమస్ సాంగ్స్ టైటిల్ తో సినిమాలు వస్తుండడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే గోపి చంద్ మాత్రం ఓ పవర్ క్యారెక్టర్ పేరు ను తన నెక్స్ట్ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేసేసుకున్నాడు. ఇంతకీ ఆ పవర్ ఫుల్ క్యారెక్టర్ మరెవరిదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది. ‘అత్తారింటికి దారేది’ పవన్ నటించిన గౌతమ్ నంద అనే క్యారెక్టర్ పేరునే టైటిల్ పెట్టుకొని స్టైలిష్ లుక్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు గోపి చంద్

gopichand-gowtham-nanda

శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె.భగవాన్-జె.పుల్లారావు నిర్మాణం లో సంపత్ నంది డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు యూనిట్. గోపీచంద్ బియర్డ్ లుక్ లో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్న ‘గౌతమ్ నంద’ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రెజెంట్ అందరినీ మెస్మరైజ్ చేస్తూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. త్వరలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ను ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.