మెచ్చుకుంటున్న ఉద్యోగులు

Monday,October 03,2016 - 02:55 by Z_CLU

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నిజాయితీగా వుండాలనే ఓ చక్కని మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్‌ టాక్‌ని సొంతం చేసుకొని దూసుకుపోతుంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగుల కోసం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ‘హైపర్‌’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. తెలంగాణ ఎన్జీవో సంఘానికి చెందిన పలువురు ఉద్యోగులు హైపర్ సినిమాను ప్రత్యేకంగా చూసి మెచ్చుకున్నారు. రామ్ యాక్టింగ్ తో పాటు సినిమా తమకు ఎంతగానో నచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగం చేయడమంటే ప్రజల పట్ల బాధ్యత వహించడమని, ప్రతి ఒక్కరూ హైపర్ సినిమా చూడాలని ఉద్యోగులు కోరుకున్నారు.