`సీటీమార్` షూట్ కూడా ఆగస్ట్ లోనే!

Friday,June 12,2020 - 12:38 by Z_CLU

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్‌`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో ఈ సినిమా వస్తోంది.

లాక్ డౌన్ కి ముందే 3 షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేశారు. ఫైనల్ షెడ్యూల్ ను ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి స్టార్ట్ చేసి, ఒకేసారి సినిమాని కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ సిద్ద‌మ‌వుతుంది.

ఈ సినిమాలో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

టెక్నీషియన్స్

సంగీతం: మ‌ణిశ‌ర్మ

డిఓపి: సౌందర్‌ రాజన్‌

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,

పి.ఆర్‌.ఓ: బి.ఎ.రాజు

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి

కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది