గ్రాండ్ గా పంతం ఆడియో రిలీజ్

Sunday,June 24,2018 - 10:30 by Z_CLU

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ‘పంతం’. ఎన్నో హిట్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై అభిరుచి గల నిర్మాత కె.కె. రాధామోహన్‌ ‘పంతం’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మిస్తున్నారు. హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘పంతం’ చిత్రం జూలై 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ముఖ్య అతిథిగా కార్య‌క్ర‌మానికి విచ్చేసిన దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేయ‌గా.. ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ తొలి ఆడియో సీడీని అందుకున్నారు.

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి ఇద్దరు వ్యక్తులు ముఖ్య కారణం. వారే ప్రసాద్‌ మూరెళ్ల.. రైటర్‌ రమేశ్‌ రెడ్డిగారు. ‘ఓ కుర్రాడి వద్ద మంచి కథ ఉంది. మీరు వినండి’ అని వారు అనడంతో కథ విన్నాను. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే కథ బాగా నచ్చింది. ‘కథ బాగా చెప్పావ్‌.. బాగా తీస్తావా?’ అని అడిగాను. ఆరోజు ఏమైనా ఫీల్‌ అయ్యాడో ఏమో కానీ.. ‘లేదు సార్‌.. అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను’ అని అన్నాడు. చెప్పినట్లే అద్భుతంగా తీశాడు. నా 25 సినిమాల్లో యజ్ఞం సినిమాలో మంచి మెసేజ్‌ ఉంటుంది. అలాంటి సినిమా పంతం. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌” అన్నారు.

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – ”గోపీచంద్‌గారి 25వ చిత్రం. ప్రెస్టీజియస్‌ మూవీని నిర్మించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌. చక్రవర్తిగారు కథను చెప్పగానే నచ్చింది. చెప్పినట్లు చక్కగా తెరకెక్కించారు. గోపీసుందర్‌గారు బ్రహ్మాండమైన మ్యూజిక్‌ అందిచారు. ప్రసాద్‌ మూరెళ్లగారు, ఎ.ఎస్‌.ప్రకాశ్‌గారు, గోపీసుందర్‌గారు చక్కగా సపోర్ట్‌ చేశారు. అనుకున్న ప్లానింగ్‌లో సినిమాను పూర్తి చేసి జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ” అన్నారు.

చిత్ర దర్శకుడు కె.చక్రవర్తి మాట్లాడుతూ – ”గోపీసుందర్‌గారు వండర్‌ఫుల్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. నేను ఒక యాక్షన్‌ సీన్‌ను రాసుకుంటే దానికి వందకు డెబ్బై మార్కులుంటే.. గోపీచంద్‌గారు యాక్ట్‌ చేసిన తర్వాత సీన్‌కు వందకు రెండు వందల మార్కులు వస్తాయి. స్క్రీన్‌పై చూసే వారికి గూజ్‌బామ్స్‌ వస్తాయి. ఆయన డైలాగ్‌ చెబితే అంత మాన్లీగా ఉంటుంది. కమాండబుల్‌ యాక్టింగ్‌, వాయిస్‌ ఉన్న హీరో. డెబ్యూ డైరెక్టర్‌లా కాకుండా నేను చెప్పేదంతా వింటూ వచ్చారు. అది కూడా కొత్త దర్శకుడైనా నాకు 25వ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌. ” అన్నారు.

గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.
ఈ చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే:  కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైర‌క్ట‌ర్‌:  బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం:  గోపీ సుంద‌ర్‌,  కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌:  కె.కె.రాధామోహ‌న్‌,  క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  కె.చ‌క్ర‌వ‌ర్తి.