జూలై 16న "గౌతమ్ నంద" ఆడియో రిలీజ్

Wednesday,July 12,2017 - 10:41 by Z_CLU

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదలవుతుండగా.. ఎస్.ఎస్.తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూలై 16న హైద్రాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్ లో ఘనంగా విడుదల చేయనున్నారు.

గోపీచంద్ 2 డిఫరెంట్ గెటప్స్ లో నటిస్తున్న ఈ సినిమాను జూలై 28న సినిమా విడుదలకు సిద్ధం చేశారు. ఇప్పటికే టీజర్-సాంగ్ ప్రోమోస్ కి విశేషమైన స్పందన లభిస్తోంది. గోపీచంద్ స్టైలిష్ లుక్స్, సంపత్ నంది స్టైలిష్ టేకింగ్, టీజర్ మరియు పోస్టర్ కు విశేషమైన స్పందన లభిస్తుండడంతో సినిమాను కూడా అంతకుమించిన స్థాయిలోనే ఆదరిస్తారనే నమ్మకంతో ఉంది యూనిట్. గోపీచంద్ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా ఇదే.