చాణక్య మూవీ అప్ డేట్స్

Saturday,August 17,2019 - 02:16 by Z_CLU

హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తున్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా టాకీ పార్ట్ షూట్ పూర్తయింది. పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు.

మరోపక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్నఈ సినిమాకు వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది చాణక్య.

నటీనటులు:
గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రైటర్: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్