గోపీచంద్ సినిమాకు లైన్ క్లియర్

Thursday,October 03,2019 - 05:30 by Z_CLU

గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మూవీకి U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇండో-పాక్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ ను సెన్సార్ సభ్యులు ప్రత్యేకంగా మెచ్చుకున్నారంటోంది యూనిట్. సినిమాను వరల్డ్ వైడ్ ఈ శనివారం రిలీజ్ చేయబోతున్నారు.

గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తిరు డైరక్ట్ చేశాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మించాడు. ఇన్నాళ్లూ గోపీచంద్ రకరకాల ప్రయోగాలు చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా మాత్రం చేయలేదు. ఆ లోటును తీర్చేలా కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతోంది చాణక్య.

యాక్షన్ సినిమా కావడంతో చాణక్య మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మరోవైపు నాన్-థియేట్రికల్ గా కూడా దాదాపు 15 కోట్లు బిజినెస్ చేసింది. అయితే సైరా వచ్చిన 3 రోజులకే ఇది థియేటర్లలోకి రావడం పెద్ద అడ్డంకి.