ఫస్ట్ టైం కలిసిన గోపీచంద్, కాజల్

Sunday,July 29,2018 - 10:50 by Z_CLU

ఇటివలే ‘పంతం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గోపీచంద్ నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటివలే నెక్స్ట్ సినిమాకు సంబంధించి కాస్ట్ & క్రూ ను ఫైనల్ చేసుకున్న గోపీచంద్ లేటెస్ట్ గా   కాజల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటివలే ఈ సినిమా కథ విన్న కాజల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాతో కుమార్ రాజా సాయి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఎస్.వి.సి.సి బ్యానర్ పై  బి.వి.ఎస్ ప్రసాద్ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.