మరో సినిమా స్టార్ట్ చేసిన గోపీచంద్

Friday,September 13,2019 - 01:44 by Z_CLU

మొన్ననే చాణక్య సినిమా కంప్లీట్ చేశాడు గోపీచంద్. అదింకా థియేటర్లలోకి రాలేదు. ఇంతలోనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. బీవీఎస్ఎన్ నిర్మాతగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి స్టార్ట్ అయింది. ఈ సినిమాతో బిను సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇతడు గతంలో సంతోష్ శివన్, జయం రాజా లాంటి డైరక్టర్స్ వద్ద వర్క్ చేశాడు

అడ్వెంచ‌ర‌స్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాకు స‌తీష్.కె సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు.

గతంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ పై సాహసం సినిమా చేశాడు గోపీచంద్. ఇప్పుడు మళ్లీ అదే బ్యానర్ పై సేమ్ జానర్ లో మరో సినిమా చేయడం విశేషం.