Gopichand Seetimaar - రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,January 28,2021 - 01:12 by Z_CLU

గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. దీంతో ఇప్పుడీ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఏప్రిల్ 2న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది సీటీమార్.

సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా ‌త‌మ‌న్నా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన గోపీచంద్, తమన్న లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో మరో 2 కీలక పాత్రల్లో దిగంగనా, భూమిక కనిపించనున్నారు.

gopichand-seetimaar-april-2-release2

రీసెంట్ గా సీటీమార్ సినిమాకు సంబంధించి టోటల్ టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఒక సాంగ్ షూట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే ఆ సాంగ్ కూడా పూర్తిచేయబోతున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు.