సీటీ మార్ అంటున్న మ్యాచో స్టార్

Monday,January 27,2020 - 12:01 by Z_CLU

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గాసిప్స్ ను నిజం చేస్తూ ఈ సినిమాకు సీటీ మార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈరోజు టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. గోపీచంద్ మెడలో విజిల్ చూస్తుంటే.. ఇది స్పోర్ట్స్ డ్రామా అనే విషయం అర్థమౌతోంది.

‘యు టర్న్‌’లాంటి హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇక సినిమా షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ఇటీవ‌ల హైద‌రాబాద్, రాజ‌మండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది సీటీ మార్. ఈరోజు నుండి RFCలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి ఈ స‌మ్మ‌ర్ లోనే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది టార్గెట్.

నటీనటులు – గోపీచంద్‌, తమన్నా, దిగంగన సూర్యవంశి, తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి
టెక్నీషియన్స్
డిఓపి: సౌందర్‌ రాజన్‌ ట
సంగీతం: మణిశర్మ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది