యాక్షన్ కంపల్సరీ అంటున్న గోపీచంద్

Sunday,July 23,2017 - 01:15 by Z_CLU

గోపీచంద్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గౌతమ్ నంద ఈ నెల 28 న రిలీజ్ కి రెడీ అవుతుంది. లాంగ్ గ్యాప్ తరవాత పర్ ఫెక్ట్ ఎంటర్ టైనర్ తో ఎట్రాక్ట్ చేయనున్న గోపీచంద్, ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాల కన్నా, సక్సెస్ రేషియో ఉన్న కథలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్తున్న గోపీచంద్ తన ఫ్యూచర్ సినిమాలపై చాలా క్లారిటీతో ఉన్నాడు.

ఫ్యూచర్ లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ చేసినా, అందులో యాక్షన్ కంపల్సరీగా ఉండేలా చూసుకుంటానన్న గోపీచంద్, గౌతమ్ నంద సినిమా తన కరియర్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పెట్టడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ‘గౌతమ్ నంద’ లో హన్సిక మోత్వాని తో పాటు కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటించారు. సంపత్ నంది ఈ సినిమాకి డైరెక్టర్.