గోపీచంద్, తమన్న మూవీ లాంఛ్

Thursday,October 03,2019 - 12:30 by Z_CLU

మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న భారీ చిత్రం ఈరోజు అఫీషియల్ గా లాంఛ్ అయింది. తమన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఓపెనింగ్ కు ఆమె కూడా వచ్చింది. బోయపాటి క్లాప్ తో మూవీ ప్రారంభమైంది.

చాణక్య సినిమాను విడుదలకు సిద్ధంచేశాడు గోపీచంద్. మరోవైపు బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ మూవీతో పాటు సంపత్ నంది సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలనేది గోపీచంద్ ప్లాన్.

ఆమధ్య వీరిద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన ‘గౌతమ్ నంద’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే ఈసారి ఓ స్పోర్ట్స్ డ్రామాను సిద్దం చేసుకున్నారు. సినిమాలో గోపీచంద్ కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తాడట.