చాణక్య.. ఓ అద్భుతమైన స్పై-థ్రిల్లర్

Monday,September 16,2019 - 12:21 by Z_CLU

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘చాణక్య’. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రంపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొనివున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా దర్శకుడు తిరు ‘చాణక్య’ చిత్రాన్ని తెరకెక్కించాడని అంటోంది యూనిట్. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, దర్శకుడు తిరు, నిర్మాత అనిల్ సుంకర, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. “రెండేళ్ల క్రితం తిరు ఈ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కొన్ని మార్పులు చెప్పాను. అవన్నీ పర్ఫెక్ట్ గా సరిచేసి అద్భుతంగా స్టోరీ రెడీ చేసాడు. అనిల్ సుంకర వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన అన్నీ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ చేశారు. ఇప్పుడు చాణక్య లాంటి ఓ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కడా వెనుకాడకుండా ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన. మెహ్రీన్ లవ్ ట్రాక్ సీన్స్ యూత్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. జరీన్ ఖాన్ సెకండాఫ్ లో వసుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర అది.”

నటీనటులు
సునీల్, నాజర్, జయప్రకాష్, రఘు బాబు, అలీ, రాజేష్ కట్టర్, ఉపేన్ పాటిల్, అశోక్ కుమార్, మీర్ సర్వర్, వినీత్ కుమార్, ఆదర్శ్, రాజా, గగన్, ప్రిన్స్,
టెక్నీషియన్స్
మాటలు: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
కెమెరా: వెట్రి పళని స్వామి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
రీ-రికార్డింగ్: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: తిరు