మరో పవర్ ఫుల్ డైలాగ్ తో గోపీచంద్

Monday,June 25,2018 - 02:26 by Z_CLU

జూలై 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది ‘పంతం’ సినిమా. గోపీచంద్ 25 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. అయితే ఈ రోజు దర్శకుడు సురేందర్ రెడ్డి లాంచ్ చేసిన  ఈ సినిమా ట్రైలర్ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ చూస్తుంటే, గోపీచంద్ ఈ సినిమాతో భారీ హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా ఈ సారి సినిమాలో మెసేజ్ ఉండేలా ప్లాన్ చేసుకున్న గోపీచంద్, ఈ సినిమాలో మోస్ట్ అగ్రెసివ్ మ్యాన్ లా కనిపించనున్నాడు. మరీ ముఖ్యంగా ‘వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బ్రతుకుని, నీ భవిష్యత్తుని..’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.

1: 53 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు సినిమాలోని హిలేరియస్ ఆంగిల్ కూడా ఎలివేట్ అవుతుంది. ముఖ్యంగా గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అవుతుందనిపిస్తుంది.

గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా K. చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో K.K. రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.